ప్రైవేటు బస్సులపై కేసులు

ABN , First Publish Date - 2021-01-13T06:17:56+05:30 IST

సంక్రాంతి పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకునిబంధనలు ఉల్లంఘించి నందుకు మొత్తం 27 బస్సులపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదుచేశారు.

ప్రైవేటు బస్సులపై కేసులు
బస్సులు తనిఖీ చేస్తున్న అధికారులు

అధిక చార్జీలు వసూలు, వాణిజ్య వస్తువుల సరఫరా, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలు


విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకునిబంధనలు ఉల్లంఘించి నందుకు మొత్తం 27 బస్సులపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదుచేశారు. డిప్యూటీ కమిషనర్‌ రాజారత్నం ఆదేశాల మేరకు ప్రైవేటు బస్సుల్లో అధిక చార్జీల వసూళ్లకు అడ్డుకట్టవేయడంతోపాటు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూసేందుకు గత మూడు రోజులుగా రవాణా శాఖ అధికారులు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమ, మంగళవారాల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నందుకు ఐదు బస్సులపైనా, నిబంధనలు అతిక్రమించి స్టేజ్‌ క్యారియర్లుగా మారిన ఏడు బస్సులపైన, వాణిజ్య వస్తువులను రవాణా చేస్తున్నందుకు రెండు బస్సులపైనా, ప్రయాణికుల జాబితాను నిర్వహించనందుకు ఏడు బస్సులపైన, కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా ఓవర్‌ లోడ్‌తో వెళుతున్నందుకు ఒక బస్సుపైన, రోడ్డు ట్యాక్స్‌ కట్టనందుకు మరో బస్సుపైన...మొత్తం 27 కేసులు నమోదుచేసినట్టు డీటీసీ తెలిపారు.

Updated Date - 2021-01-13T06:17:56+05:30 IST