రికార్డు స్థాయిలో కేసులు

ABN , First Publish Date - 2021-05-03T04:35:37+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం మరోసారి రికార్డుస్థాయిలో 1938 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది.

రికార్డు స్థాయిలో కేసులు

జిల్లాలో 1938కి పాజిటివ్‌ 

చికిత్స పొందుతూ మరో ఏడుగురి మృతి.. 


విశాఖపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం మరోసారి రికార్డుస్థాయిలో 1938 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వీటితో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 83,576కు చేరింది. కాగా కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగుతోంది. శనివారం జిల్లాలో 913 మంది కోలుకోగా,  ఆదివారం మరో 907 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌లు సంఖ్య 70,875కు చేరింది. చికిత్స పొందుతూ మరో ఎనిమిది మంది మృతి చెందగా మొత్తం కొవిడ్‌ మరణాలు 626కు చేరాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పేర్కొంటున్నారు. 


Updated Date - 2021-05-03T04:35:37+05:30 IST