ఏవోబీలో మావోల డంప్‌ స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-26T05:44:03+05:30 IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఒడిశా పోలీసులు శనివారం మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఏవోబీలో మావోల డంప్‌ స్వాధీనం
ఏవోబీలో మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్న ఒడిశా పోలీసులుసీలేరు , డిసెంబరు 25: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఒడిశా పోలీసులు శనివారం మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా జొడంబో స్టేషన్‌ పరిధిలో గల స్వాభిమానాంచల్‌ ప్రాంతంలో డంప్‌ వున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. మరిబెడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డంప్‌లో ఆరు డిటోనేటర్లు, ఒక హ్యాండ్‌ గ్రెనేడ్‌, ఆరు వైరు బండిల్స్‌, 9 ఎంఎం ఖాళీ కేసులు 5, చార్జింగ్‌ క్లిప్‌లు 65, డిష్‌ కేబుల్‌ 5 మీటర్లు, ఒక బ్యాటరీ, జనరేటర్‌, తదితర సామగ్రి వున్నట్టు మల్కన్‌గిరి జిల్లా ఎస్‌డీపీఓ రాహుల్‌జీ తెలిపారు. ఈ సామగ్రిని మావోయిస్టులు పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగిస్తారన్నారు.

 

Updated Date - 2021-12-26T05:44:03+05:30 IST