148 ఎకరాల్లో గంజాయి మొక్కలు ధ్వంసం

ABN , First Publish Date - 2021-11-09T05:59:43+05:30 IST

జి.మాడుగుల మండలంలోని నుర్మతి పంచాయతీలో గంజాయి తోటలపై సోమవారం నిర్వహించిన దాడుల్లో 148 ఎకరాల్లో సాగు చేస్తున్న 7 లక్షల 40 వేల మొక్కలను ధ్వంసం చేసినట్టు స్థానిక ఎస్‌ఈబీ సీఐ ఎ.సంతోశ్‌ తెలిపారు.

148 ఎకరాల్లో గంజాయి మొక్కలు ధ్వంసం
వాకపల్లిలో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న ఎస్‌ఈబీ సిబ్బందిపాడేరురూరల్‌, నవంబరు 8: జి.మాడుగుల మండలంలోని నుర్మతి పంచాయతీలో గంజాయి తోటలపై సోమవారం నిర్వహించిన దాడుల్లో 148 ఎకరాల్లో సాగు చేస్తున్న 7 లక్షల 40 వేల మొక్కలను ధ్వంసం చేసినట్టు స్థానిక ఎస్‌ఈబీ సీఐ ఎ.సంతోశ్‌ తెలిపారు. వాకపల్లి, డిప్పలగొంది, వండ్రంగుల గ్రామాల్లో దాడులను చేపట్టారన్నారు. నరికిన మొక్కలను పెట్రోల్‌తో తగలబెట్టారన్నారు. అలాగే పాడేరు మండలంలోని మూడు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా 16 ఎకరాల్లో సాగు చేస్తున్న 80 వేల గంజాయి మొక్కలను ధ్వంసం చేశారని ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు. గొండెలి, కించూరు పంచాయతీల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పరివర్తన కార్యక్రమంతో చైతన్యవంతులైన చీడిమెట్ట, తోటలగొంది, బొంగజంగి గ్రామాల ప్రజలు మూడు చోట్ల పోలీసుల సమక్షంలోనే గంజాయి తోటలను ధ్వంసం చేశారన్నారు. ఈ సందర్భంగా గంజాయి సాగును ఇకపై చేపట్టమని ప్రజలు ప్రతిజ్ఞ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ టి.రవికుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T05:59:43+05:30 IST