ప్రశాంతంగా స్టీల్‌ కో-ఆపరేటివ్‌ స్టోర్స్‌ ఎన్నికలు

ABN , First Publish Date - 2021-12-31T06:13:24+05:30 IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కో-ఆపరేటివ్‌ స్టోర్స్‌ పాలక వర్గం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి.

ప్రశాంతంగా స్టీల్‌ కో-ఆపరేటివ్‌ స్టోర్స్‌ ఎన్నికలు

ఉక్కుటౌన్‌షిప్‌, డిసెంబరు 30: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కో-ఆపరేటివ్‌ స్టోర్స్‌ పాలక వర్గం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం తొమ్మిది నుంచి సాయం త్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు జరిగాయి. ఆరు డైరెక్టర్ల స్థానానికి మొత్తం 39 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సుమారు 13 వేల మంది ఓటర్లకు గాను 71.8 శాతం ఓటింగ్‌ జరిగినట్టు ఎన్నికల అధికారి దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్టీల్‌ ప్లాంట్‌ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పొలింగ్‌ కేంద్రం వద్ద కార్మిక సంఘాల నాయకులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం చేపట్టారు. 


విజేతలు వీరే..

స్టీల్‌ప్లాంట్‌ కో-ఆపరేటీవ్‌ స్టోర్స్‌ పాలక వర్గం ఎన్నికల్లో బీటీ జగదీశ్‌ (ఇంటక్‌), ఆకుల నూకరాజు (ఇంటక్‌), ఏవీవీ సత్యనారాయణ (సీఐటీయూ), జి.నాగభూషణం (ఏఐటీ యూసీ), డీవీ నాగబాబు (ఏఐటీయూసీ), ఐ.లోకేశ్‌ (సీఐ టీయూ) విజయం సాఽధించారు. మొత్తం ఆరు డైరెక్టర్ల పోస్టులకు గాను ఏ ఒక్క యూనియన్‌కు స్పష్టమైన మెజారిటీ రాలేదు. మూడు ప్రధాన యూనియన్‌లకు చెందిన ప్యానెల్‌లో ఇద్దరు చొప్పున విజయం సాధించారు. స్టోర్స్‌ అఽధ్యక్షుడు ఎవరనేది ఒకటి, రెండు రోజుల్లో తేలనున్నది.


Updated Date - 2021-12-31T06:13:24+05:30 IST