నేటి నుంచి విద్యార్థులకు బస్‌ పాస్‌లు

ABN , First Publish Date - 2021-07-12T05:50:56+05:30 IST

ప్రజా రవాణా శాఖ (పీటీడీ) స్టూడెంట్‌ బస్‌పాస్‌లను సోమవారం నుంచి జారీ చేయనున్నది. కళాశాలల విద్యార్థులకు తరగతులు మొదలయ్యాయి.

నేటి నుంచి విద్యార్థులకు బస్‌ పాస్‌లు

ద్వారకాబస్‌స్టేషన్‌, జులై 11 : ప్రజా రవాణా శాఖ (పీటీడీ) స్టూడెంట్‌ బస్‌పాస్‌లను సోమవారం నుంచి జారీ చేయనున్నది. కళాశాలల విద్యార్థులకు తరగతులు మొదలయ్యాయి. ఇంజనీరింగ్‌, ఇతర కోర్సుల పరీక్షలు కూడా ప్రారంభం అయ్యాయి. దీంతో ఆయా విద్యార్థులు రవాణా పరంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో పీటీడీ విశాఖ రీజియన్‌ అధికారులు సోమవారం నుంచి అన్ని కౌంటర్లలో విద్యార్థులకు బస్‌ పాస్‌లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ద్వారకా కాంప్లెక్సు, మద్దిలపాలెం డిపోలలో ఉదయం 8.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు, ఎంవీపీకాలనీ, గాజువాక, స్టీల్‌ సిటీ, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం కాంప్లెక్సుల్లో ఉదయం 9.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు స్టూడెంట్‌ బస్‌పాస్‌లు జారీ చేయనున్నట్టు పీటీడీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌మేనేజర్‌(అర్బన్‌) సుధాబిందు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. 


Updated Date - 2021-07-12T05:50:56+05:30 IST