వ్యవసాయ చట్టాల ప్రతులు దహనం

ABN , First Publish Date - 2021-01-14T05:20:24+05:30 IST

మండలంలోని పెదలబుడు పంచాయతీ శరభగుడ గ్రామానికి చెందిన గిరిజన రైతులు, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి మూడు వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.

వ్యవసాయ చట్టాల ప్రతులు దహనం
డుంబ్రిగుడలో వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటలో వేస్తున్న సీఐటీయూ నేతలు

కేంద్రం తీరుపై గిరిజనులు, సీఐటీయూ నిరసన

అరకులోయ టౌన్‌: మండలంలోని పెదలబుడు పంచాయతీ శరభగుడ గ్రామానికి చెందిన గిరిజన రైతులు, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి మూడు వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ చట్టాల వల్ల తమకు ఎంతోనష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.గోపి, పి.రాము, టి.హరి, మగ్గన్న, సహదేవ్‌,నానిబాబు, కోటి, తదితరులు పాల్గొన్నారు.


డుంబ్రిగుడ: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సీఐటీయూ నాయకులు బుధవారం ఆయా ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు ఎస్‌.గురుముసింగ్‌ మాట్లాడుతూ, ఈ చట్టాల వల్ల గిరిజన రైతులకు ఊహించని నష్టం జరుగుతుందని అన్నారు.


Updated Date - 2021-01-14T05:20:24+05:30 IST