రుషికొండ బీచ్‌లో బోటుషికార్‌ పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-12-09T05:04:05+05:30 IST

పర్యాటకాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటు షికార్‌ను రుషికొండ బీచ్‌లో బుధవారం పునఃప్రారంభించారు. తుఫాన్‌ల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వారం రోజులుగా దీనిని నిలిపివేశారు.

రుషికొండ బీచ్‌లో బోటుషికార్‌ పునఃప్రారంభం
బోటుషికార్‌ చేస్తున్న సందర్శకులు

సాగర్‌నగర్‌, డిసెంబరు 8: పర్యాటకాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటు షికార్‌ను రుషికొండ బీచ్‌లో బుధవారం పునఃప్రారంభించారు. తుఫాన్‌ల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వారం రోజులుగా దీనిని నిలిపివేశారు. బీచ్‌కు సందర్శకులతాకిడి ఎక్కువగా ఉండడంతో పాటు, బోటు షికార్‌ ద్వారా శాఖకు ఆదాయం భారీగా సమకూరుతోంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండడంతో తిరిగి ప్రారంభించారు. దీంతో సందర్శకులు సముద్రవిహారంతో సందడి చేశారు.  


Updated Date - 2021-12-09T05:04:05+05:30 IST