బోసిబోయిన తుమ్మపాల వారపు సంత

ABN , First Publish Date - 2021-05-09T04:38:43+05:30 IST

తుమ్మపాలలో ప్రతి శనివారం నిర్వహించే వారపు సంత మధ్యాహ్నానికే మూతపడింది.

బోసిబోయిన తుమ్మపాల వారపు సంత
ఖాళీగా ఉన్న తుమ్మపాల సంత ప్రాంగణం

కొనుగోలుదారులు లే(రా)క స్తంభించిన లావాదేవీలు
నష్టాలు చవిచూసిన వ్యాపారులు

తుమ్మపాల, మే 8:
తుమ్మపాలలో ప్రతి శనివారం నిర్వహించే వారపు సంత మధ్యాహ్నానికే మూతపడింది. కొనుగోలుదారులు అరకొరగా రావడంతో వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా జరిగాయి. పశువులు, నాటుకోళ్ల అమ్మకాలు ఉదయం గంట మాత్రమే జరిగాయి. వస్త్ర దుకాణాలు తెరుచుకోలేదు. సంత బోసిబోవడంతో వ్యాపారాలన్నీ నష్టాలు చవిచూసినట్టు వర్తకులు తెలిపారు. రానున్న రెండు వారాలు సంతను పూర్తిగా రద్దు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఈవో కె.శ్రీనివాసరావు చెప్పారు.

Updated Date - 2021-05-09T04:38:43+05:30 IST