మాతృ భాషను కాపాడాలంటూ 29న బీజేపీ నిరసన

ABN , First Publish Date - 2021-08-27T05:55:06+05:30 IST

మాతృ భాషను కాపాడే బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

మాతృ భాషను కాపాడాలంటూ 29న బీజేపీ నిరసన
సమావేశంలో మాట్లాడుతున్న మాధవ్‌

ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌

పెదవాల్తేరు, ఆగస్టు 26: మాతృ భాషను కాపాడే బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. గురువారం బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ఆదేశాల మేరకు తెలుగు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న బీచ్‌రోడ్డులోని గిడుగు రామమూర్తి పంతులు విగ్రహం వద్ద మాతృ భాషను కాపాడాలంటూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ‘ఆంగ్లం వద్దు-తెలుగు భాష ముద్దు’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం తెలుగు భాషను భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తుందని విచారం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, నాయకులు సుహాసినీ ఆనంద్‌, ఎస్‌వీఎస్‌ ప్రకాశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-27T05:55:06+05:30 IST