సబ్‌ప్లాన్‌ నిధులు విడుదల చేయాలని బీజేపీ ధర్నా

ABN , First Publish Date - 2021-08-10T05:56:20+05:30 IST

ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ నిధులను తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు సోమవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

సబ్‌ప్లాన్‌ నిధులు విడుదల చేయాలని బీజేపీ ధర్నా
సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద బీజేపీ నేతల ఆందోళన


పాడేరు, ఆగస్టు 9: ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ నిధులను తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు సోమవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సబ్‌ప్లాన్‌ నిధులను ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల అభివృద్ధికి వ్యయం చేయడం లేదన్నారు. తక్షణమే సబ్‌ప్లాన్‌ నిధులు విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. అలాగే తమ డిమాండ్లపై అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో బీజేపీ నేతలు లోకుల గాంధీ, ఉమామహేశ్వరరావు, పెనుమాక రవికుమార్‌, పాంగి రాజారావు, కృష్ణారావు, కురసా రాజారావు, ఎన్‌.ఉమామహేశ్వరరావు, శాంతకుమారి, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-10T05:56:20+05:30 IST