నగరంలో భోగి వెలుగులు

ABN , First Publish Date - 2021-01-14T05:18:45+05:30 IST

నగరంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం ఉదయం భోగి మంటలు వేశారు. తెల్లవారుజాము నుంచే ఆయా వీధులన్నీ భోగి మంటలతో వెలుగులు విరజిమ్మాయి

నగరంలో భోగి వెలుగులు
రామ్మూర్తిపంతులుపేట వద్ద భోగి మంటలు

తెల్లవారుజాము నుంచే వీధుల్లో సందడి

పోటాపోటీగా మంటలు

బీచ్‌ రోడ్డులో పతంగులు ఎగురవేసిన చిన్నారులు

విశాఖపట్నం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): నగరంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం ఉదయం భోగి మంటలు వేశారు. తెల్లవారుజాము నుంచే ఆయా వీధులన్నీ భోగి మంటలతో వెలుగులు విరజిమ్మాయి. ప్రతి ఇంటి ఆవరణలో వేసిన భోగి మంట వద్ద చిన్నా,పెద్దా అన్న తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. కొంతమంది యువత అనేక చోట్ల పోటాపోటీగా పెద్ద మంటలను వేశారు. కాలనీ అసోసియేషన్లు, ఇతర సంఘాల ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున భోగి మంటలు వేశారు. 

పతంగుల పండుగ 

సంక్రాంతి అంటేనే చిన్నారులకు పతంగుల పండుగ. భోగి రోజైన బుధవారం బీచ్‌ రోడ్డుతోపాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో చిన్నారులు పతంగులతో సందడి చేశారు. మేడలపైకి ఎక్కి, బీచ్‌ రోడ్డులోను పతంగులను ఎగురవేస్తూ చిన్నారులు ఆనందంగా గడిపారు.

Updated Date - 2021-01-14T05:18:45+05:30 IST