భీమిలి టీడీపీ ఇన్‌చార్జిగా కోరాడ రాజబాబు
ABN , First Publish Date - 2021-06-24T05:16:50+05:30 IST
భీమునిపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జిగా తెలుగుదేశం పార్టీ కోరాడ రాజబాబును నియమించింది.
విశాఖపట్నం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): భీమునిపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జిగా తెలుగుదేశం పార్టీ కోరాడ రాజబాబును నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. భీమిలి ఇన్‌చార్జిగా వున్న పార్టీ సీనియర్ నేత సబ్బం హరి ఇటీవల చనిపోయారు. ఈ నేపథ్యంలో రాజబాబుకు బాధ్యతలు అప్పగించారు. పార్టీలో సీనియర్ నాయకుడైన రాజబాబు గతంలో ఆనందపురం సర్పంచ్‌గా, మండలాధ్యక్షునిగా పనిచేశారు.