ఓటీఎస్‌తో లబ్ధిదారులకు మేలు
ABN , First Publish Date - 2021-11-26T06:31:58+05:30 IST
జగన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా అమలు చేస్తున్న ఓటీఎస్ (వన్‌టైమ్ సెటిల్‌మెంట్) వల్ల లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు.

సబ్బవరంలో అమలు తీరు భేష్
కలెక్టర్ మల్లికార్జున
సబ్బవరం, నవంబరు 25 : జగన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా అమలు చేస్తున్న ఓటీఎస్ (వన్‌టైమ్ సెటిల్‌మెంట్) వల్ల లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. మండలంలోని గొటివాడ, సబ్బవరం-4 సచివాల యాలను గురువారం ఆయన సందర్శించి ఓటీఎస్ అమలు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటీఎస్ కింద రూ.10 వేలు చెల్లించిన లబ్ధిదారులకు కేవలం రూ.1కే సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. సబ్బవరం మండలంలో అధికారులందరూ సమన్వయంతో పని చేసి మంచి ఫలితాలు రాబట్టారన్నారు. సుమారు 236 మంది లబ్ధిదారులను చైతన్యపరిచి వారి నుంచి రూ.22 లక్షల వరకు వసూలు చేశారన్నారు. గొటివాడ సర్పంచ్ సాలాపు మీనా మాట్లాడుతూ తమ గ్రామంలో లబ్ధిదారులకు పైడివాడలో ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చారని, స్థలాలు చూపించలేదని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గాలిభీమవరం సర్పంచ్ గొర్లి రాజేశ్ మాట్లాడుతూ స్థానికంగా కాకుండా వేరే చోట్ల ఇళ్ల స్థలాలు కేటాయించారని, స్థానికంగానే ఇళ్ల స్థలాలు కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ పి.శ్రీనివాసరావు, డీఈ ఏవీవీఎస్‌ఎన్ రాజు, ఎంపీడీవో రమేశ్ నాయుడు, తహసీల్దార్ రమాదేవి, ఏఈ నాయుడు, ఆర్‌ఐ సుధాకర్, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.
పరవాడలో..
పరవాడ : జగన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద అమలు చేస్తున్న ఓటీఎస్‌ను లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఎంపీపీ పైలా వెంకట పద్మలక్ష్మి శ్రీనివాస్ కోరారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ పైలా సన్యాసిరాజు, వైస్ ఎంపీపీ బంధం నాగేశ్వరరావు, తహసీల్దార్ బీవీ రాణి, ఎంపీడీవో వి.హేమసుందరరావు, హౌసింగ్ ఏఈ ఎంఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి, ఎంఈవో సునీత తదిరులు పాల్గొన్నారు.