ఉక్కు పరిరక్షణకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధం

ABN , First Publish Date - 2021-10-19T06:07:33+05:30 IST

ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వరంగంలో కొనసాగిస్తున్నట్టు ప్రకటన వచ్చేవరకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు.

ఉక్కు పరిరక్షణకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధం
రిలే నిరాహార దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న డి.ఆదినారాయణ

పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, అక్టోబరు 18: ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వరంగంలో కొనసాగిస్తున్నట్టు ప్రకటన వచ్చేవరకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు  249వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షల్లో పాల్గొన్న ఉద్యోగులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్మికులు ఉద్యమం చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం నిర్వహించ తలపెట్టిన 25 గంటల దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ శిబిరంలో పలువురు ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, ఉక్కు ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T06:07:33+05:30 IST