ఉక్కు టౌన్‌షిప్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2021-10-14T05:52:39+05:30 IST

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు నిలుస్తున్నాయని వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఎంప్లాయీస్‌ అధ్యక్షుడు బి.రాజ్‌కుమార్‌ అన్నారు.

ఉక్కు టౌన్‌షిప్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు

ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 13: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు నిలుస్తున్నాయని వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఎంప్లాయీస్‌ అధ్యక్షుడు బి.రాజ్‌కుమార్‌ అన్నారు. అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌ ఇందిరాగాంధీ పార్కులో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఎంతో సందడిగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యానిర్వాహక అధ్యక్షుడు జి.ఆనంద్‌, ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, ప్రతినిధులు మల్లేశం, కనకరాజు, నరసింగరావు, లాలు, గోపాల్‌  పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-14T05:52:39+05:30 IST