మోదకొండమ్మను దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు

ABN , First Publish Date - 2021-08-20T05:54:39+05:30 IST

స్థానిక మోదకొండమ్మను తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు గురువారం దర్శించుకున్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, విశాఖపట్నం జీవీఎంసీ ప్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు గురువారం స్థానిక మోదకొండమ్మను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.

మోదకొండమ్మను దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు
మోదకొండమ్మ ఆలయంలో అయ్యన్నపాత్రుడికి అమ్మవారి చిత్రపటాని అందిస్తున్న టీడీపీ నాయకులు


పాడేరురూరల్‌, ఆగస్టు 19: స్థానిక మోదకొండమ్మను తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు గురువారం దర్శించుకున్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, విశాఖపట్నం జీవీఎంసీ ప్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు గురువారం స్థానిక మోదకొండమ్మను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. పట్టణానికి వచ్చిన టీడీపీ నాయకులకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా నాగరాజు, టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి తదితరులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి పూజలు అనంతరం వచ్చిన అతిథులను శాలువలతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వంతాల నాగేశ్వరరావు, బి.వెంకటరమణ, డీవీ.కుమారి, ఎ.సుబ్బలక్ష్మి, బి.వరలక్ష్మి, బొర్రా మణికంఠరాజు, ఎస్‌.లక్ష్మణరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-20T05:54:39+05:30 IST