సికిల్ సెల్ ఎనీమియాకు ఆయుర్వేద వైద్యం
ABN , First Publish Date - 2021-01-20T06:06:38+05:30 IST
ఏజెన్సీలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వారికి ఆయుర్వేద వైద్యం అందించేందుకు చర్యలు చేపడతామని ఆయుర్వేద వైద్యుల బృందం పేర్కొంది.

ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌తో భేటీ
పాడేరు, జనవరి 19: ఏజెన్సీలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వారికి ఆయుర్వేద వైద్యం అందించేందుకు చర్యలు చేపడతామని ఆయుర్వేద వైద్యుల బృందం పేర్కొంది. మంగళవారం ట్రైబల్ హెల్త్ రాష్ట్ర సమన్వయకర్త డీఎన్.మూర్తి ఆధ్వర్యంలో ఈ వైద్యుల బృందం ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌తో భేటీ అయ్యింది. ఇందుకు ఐటీడీఏ సహకారం అందించాలని ఉత్తరాఖండ్‌కు చెందిన సీనియర్ హెర్బల్ శాస్త్రవేత్త డాక్టర్ విజయప్రసాద్‌భట్, జేఎన్‌టీయూ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టరు పీఎస్ ప్రసాద్, తదితరులు ఐటీడీఏ పీవోను కోరారు. ప్రభుత్వం సహకారమందిస్తే తాము చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో హెర్బల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ కేవీఎస్.మూర్తి, టీడబ్ల్యూ డీడీ జి.విజయకుమార్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ కె.లీలాప్రసాద్ పాల్గొన్నారు.