స్వచ్ఛ సంకల్పంపై అవగాహన సదస్సులు

ABN , First Publish Date - 2021-08-10T06:14:20+05:30 IST

గ్రామాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోదెపు గోవింద్‌, పట్టణ అధ్యక్షుడు బొద్దపు యర్రయ్యదొర అన్నారు.

స్వచ్ఛ సంకల్పంపై అవగాహన సదస్సులు
ఎలమంచిలిలో అవగాహన ర్యాలీ

 


 ఎలమంచిలి, ఆగస్టు 9 : గ్రామాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోదెపు గోవింద్‌, పట్టణ అధ్యక్షుడు బొద్దపు యర్రయ్యదొర  అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంపై పులపర్తిలో సోమవారం ఏర్పాటై అవగాహన సదస్సులో మాట్లాడారు. తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో సత్యనారాయణ, వెలుగు ఏపీఎం సత్యనారాయణ, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మునగపాక: గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని ఎంపీడీవో ఉదయశ్రీ సూచించారు. స్వచ్ఛ సంకల్పంపై సోమవారం ఇక్కడ ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. తడి, పొడిచెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు.  ఈవోపీఆర్డీ ప్రసాద్‌, ఏవో రవికుమార్‌, మండల ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, వైద్యాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, గ్రామ కార్యదర్శులు, వలంటీర్లు పాల్గొన్నారు. 

రాంబిల్లి : జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని రాంబిల్లి ఎంపీడీవో కొండలరావు సూచించారు. సోమవారం ఇక్కడ కార్యదర్శులు, అంగన్‌వాడీ సిబ్బంది, వలంటీర్లకు ఏర్పాటైన అవగాహన సదస్సులో మాట్లాడారు.  పీహెచ్‌సీ వైద్యాధికారణి జి.అమృతసాయి, వైసీపీ మండల కన్వీనర్‌ జి.శ్రీనుబాబు, ఈవోపీఆర్డీ మహేశ్‌, సర్పంచ్‌ పి.కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-10T06:14:20+05:30 IST