సంప్రదాయాలకు ప్రతిబింబం మేలుకొలుపు

ABN , First Publish Date - 2021-01-13T05:26:16+05:30 IST

మేలుకొలుపు కార్యక్రమంతో సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని ఆర్‌ఎస్‌ఎస్‌ ఉత్తరాంధ్ర ప్రచారక్‌ జనార్దన్‌ అన్నారు.

సంప్రదాయాలకు ప్రతిబింబం మేలుకొలుపు
మేలుకొలుపు సమ్మేళనంలో మాట్లాడుతున్న జనార్దన్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ ఉత్తరాంధ్ర ప్రచారక్‌ జనార్దన్


రావికమతం, జనవరి 12: మేలుకొలుపు కార్యక్రమంతో సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని ఆర్‌ఎస్‌ఎస్‌ ఉత్తరాంధ్ర ప్రచారక్‌ జనార్దన్‌ అన్నారు. మండలంలోని మేడివాడ గ్రామంలో మంగళవారం నిర్వహించిన మేలుకొలుపు సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రామ జన్మభూమిలో రామాలయం పునర్నిర్మాణానికి అందరూ తోచిన విరాళం అందించాలని కోరారు. నన్నయ్య యూనివర్సిటీ మాజీ ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు మాట్లాడుతూ, హిందూ సంప్రదాయాలను ప్రపంచానికే చాటిచెప్పిన స్వామి వివేకానంద జయంతిని ఇంతమంది సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అంతకుముందు నాలుగు మండలాల భక్తులు, భజన బృందాలు గ్రామ పురవీధుల్లో ఆలపించిన భక్తిగీతాలు అలరించాయి. కార్యక్రమంలో సమరపత సేవా ఫౌండేషన్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రతినిధులు కె.శివశేఖర్‌, గొర్లె సత్యారావు, గల్లా రాజేశ్వరావు, ముక్కా జోగేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-13T05:26:16+05:30 IST