ఆటో బోల్తా : ఐదుగురికి స్వల్ప గాయాలు

ABN , First Publish Date - 2021-08-10T06:10:53+05:30 IST

మండ లంలోని కొండలఅగ్రహా రం వద్ద ఓ ఆటో అదుపు తప్పి బోల్తాపడిన ఘట నలో ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలకు గుర య్యారు.

ఆటో బోల్తా : ఐదుగురికి స్వల్ప గాయాలు
బోల్తా పడిన ఆటోమాకవరపాలెం, ఆగస్టు 9 : మండ లంలోని కొండలఅగ్రహా రం వద్ద ఓ ఆటో అదుపు తప్పి బోల్తాపడిన ఘట నలో ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలకు గుర య్యారు. ఇందుకు సం బంధించిన వివరాలివి. నర్సీపట్నం నుంచి మాకవరపాలెం వైపు ప్రయాణికులతో ఓ ఆటో వెళు తోంది. కొండలఅగ్రహారం వద్దకు వచ్చేసరికి ముందు వెళు తున్న కారు డ్రైవర్‌ ఒక్క సారిగా బ్రేక్‌ వేయడంతో  ఆటో  బోల్తా పడింది. దీంతో అం దులో ఉన్న ప్రయాణి కులు స్వల్ప గాయాలకు గురయ్యారు. వెంటనే వారిని 108 వాహ నంలో స్థానికులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రామకృష్ణరావు తెలిపారు. a

Updated Date - 2021-08-10T06:10:53+05:30 IST