నల్గొండ పోలీసులపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టాలి

ABN , First Publish Date - 2021-10-19T06:24:03+05:30 IST

గిరిజనులపై అమానుషంగా కాల్పులు జరిపిన నల్గొండ పోలీసులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు లు నమోదు చేయాలని టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు.

నల్గొండ పోలీసులపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టాలి
విలేకర్లతో మాట్లాడుతున్న లక్ష్మణరావు


 టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు

చింతపల్లి, అక్టోబరు 18: గిరిజనులపై అమానుషంగా కాల్పులు జరిపిన నల్గొండ పోలీసులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు లు నమోదు చేయాలని టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. సోమవారం గాలిపాడు గ్రామాన్ని సందర్శించిన ఆయన బాధిత కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలను కలిశారు. జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. గిరిజనులను చర్చలకు పిలిచి లంబసింగి ఘాట్‌లో ఎటువంటి హెచ్చరికలు చేయకుండా కాల్పులు జరపడం అన్యాయమన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ పోలీసులు తక్షణమే స్పందించాలన్నారు. నిరాయుధులైన గాలిపాడు గిరిజనులపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఏపీ పోలీసులు నల్గొండ పోలీసులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే పోలీసు కాల్పుల్లో గాయపడిన కిల్లో కామరాజు, కిల్లో రాంబాబులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. జరిగిన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని, లేదంటే టీడీపీ ఆందోళన ఉధృతం చేస్తుందన్నారు. అలాగే చింతపల్లి ఎంపీపీ వంతల బాబూరావు, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య కూడా నల్గొండ పోలీసులపై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో అన్నవరం సర్పంచ్‌ పాంగి సన్యాసిరావు, ఎంపీటీసీ సభ్యుడు కొర్ర సూరిబాబు పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-19T06:24:03+05:30 IST