నాటుసారా బట్టీలపై దాడులు
ABN , First Publish Date - 2021-10-30T04:17:21+05:30 IST
ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం పరిసర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న నాటుసారా బట్టీలపై గాజువాక స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు చేపట్టారు.
140 లీటర్ల సారా స్వాధీనం
3,500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
పరవాడ, అక్టోబరు 29: ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం పరిసర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న నాటుసారా బట్టీలపై గాజువాక స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 140 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. 3,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం గ్రామాల పరిధిలోని జీడిమామిడి తోటల్లో గత కొన్నేళ్లుగా కొంత మంది వ్యక్తులు నాటుసారా తయారు చేస్తున్నారు. దీనిపై స్థానికులు గాజువాక స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వారు రంగంలో దిగి విస్తృతంగా దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 140 లీటర్ల నాటు సారాతో పాటు తయారీకి ఉపయోగించిన పాత్రలు, డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటు సారాను తరలించడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ శ్రీనాథుడు, ఇన్‌స్పెక్టర్లు అప్పలరాజు, గణేశ్, సురేశ్, మన్మథరావు, ఎస్‌ఐ అమన్‌రావు సిబ్బంది పాల్గొన్నారు.