25నుంచి ఆసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-01-20T06:00:07+05:30 IST

ఆసెట్‌-2020 రెండవ విడత కౌన్సెలింగ్‌ ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు జరుగుతుందని ఏయూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ప్రొఫెసర్‌ డీఏ నాయుడు మంగళవారం తెలిపారు.

25నుంచి ఆసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌


ఏయూ క్యాంపస్‌, జనవరి 19: ఆసెట్‌-2020 రెండవ విడత కౌన్సెలింగ్‌ ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు జరుగుతుందని ఏయూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ప్రొఫెసర్‌ డీఏ నాయుడు మంగళవారం తెలిపారు. ఆసెట్‌, ఆఈట్‌ రెండవ విడత కౌన్సెలింగ్‌కు ఈనెల 22 నుంచి 24 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్‌లు అప్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. ఆఈట్‌-2020 రెండవ విడత కౌన్సెలింగ్‌ ఈనెల 27, 28 తేదీల్లో జరుగుతుందని పేర్కొన్నారు. 30న అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని, ఈనెల 31, ఫిబ్రవరి 1న ఫీజు చెల్లించాలని తెలిపారు. సీట్లు వచ్చినవారు ఫిబ్రవరి 2న ప్రిన్సిపాల్స్‌కు రిపోర్టు చేయాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-01-20T06:00:07+05:30 IST