కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-01-13T05:04:00+05:30 IST

పారిశ్రామిక ప్రాంతం పరిధిలోని శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రిలో ఈ నెల 16 నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి
వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న జడ్సీ సింహాచలం

మల్కాపురం, జనవరి 12 : పారిశ్రామిక ప్రాంతం పరిధిలోని శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రిలో ఈ నెల 16 నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల ఈ ఆస్పత్రిలో డ్రై రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ జోన్‌- 4 జోనల్‌ కమిషనర్‌ పొందూరు సింహాచలం ఆస్పత్రిని మంగళవారం సందర్శించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ పర్యవేక్షకులైన జీవీఎంసీ జోన్‌- 4 ఈఈ రత్నాల రాజు, ఏఈ సత్యనారాయణలకు ఆయన పలు సూచనలు చేశారు. 

Updated Date - 2021-01-13T05:04:00+05:30 IST