ఆపస్‌ జిల్లా కార్యవర్గం ఏర్పాటు

ABN , First Publish Date - 2021-03-22T05:52:35+05:30 IST

మండలంలోని శేరిఖండంలో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయసంఘం (ఆపస్‌) జిల్లా కార్యవర్గ ఎన్నిక ఆదివారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిప్రసాద్‌, సామాజిక సమరసతా వేదిక జిల్లా అధ్యక్షుడు ఎ.అప్పారావుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఆపస్‌ జిల్లా కార్యవర్గం ఏర్పాటు
నూతనంగా ఎన్నికైన ఆపస్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు

పద్మనాభం, మార్చి 21: మండలంలోని శేరిఖండంలో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయసంఘం (ఆపస్‌) జిల్లా కార్యవర్గ ఎన్నిక ఆదివారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిప్రసాద్‌, సామాజిక సమరసతా వేదిక జిల్లా అధ్యక్షుడు ఎ.అప్పారావుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆపస్‌ జిల్లా అధ్యక్షుడిగా అవనాపు అరుణ్‌కుమార్‌ (పద్మనాభం), ప్రధాన కార్యదర్శిగా జీవీఎన్‌ రమేశ్‌కుమార్‌ (చీడికాడ), ఉపాధ్యక్షులుగా జి.నరసింహమూర్తి (బుచ్చెయ్యపేట), ఎ.చిట్టినాయుడు (హుకుంపేట), కార్యదర్శులుగా ఎస్‌.అచ్చిబాబు (అనంతగిరి), ఎ.సురేశ్‌ (భీమిలి), ఎస్‌.నారాయణరావు (జి.మాడుగుల), ఎం.ఉమామహేశ్వరి (బుచ్చెయ్యపేట), ఎల్‌.సుగుణ రత్నావళి (అనంతగిరి) ఎన్నికయ్యారు. అలాగే మహిళా కన్వీనర్‌గా ఎస్‌.నవీనభారతి, ఆడిట్‌ కమిటీ సభ్యుడిగా డి.రమేశ్‌, గౌరవ సలహాదారుగా ఎ.అప్పారావు, గౌరవ అధ్యక్షుడిగా ఎస్‌.గౌతంనాయుడులు ఎన్నికయ్యారు. 


Updated Date - 2021-03-22T05:52:35+05:30 IST