ఏఎల్‌పురానికి వైరస్‌ సోకిన వ్యక్తి వచ్చాడని ఆందోళన!

ABN , First Publish Date - 2021-05-02T05:31:25+05:30 IST

గొలుగొండ మండలం ఏఎల్‌పురానికి కరోనా సోకిన వ్యక్తి వచ్చాడని తెలియడంతో కొందరు గ్రామస్థులు శనివారం హడలిపోయారు.

ఏఎల్‌పురానికి వైరస్‌ సోకిన వ్యక్తి వచ్చాడని ఆందోళన!


కృష్ణాదేవిపేట, మే 1 : గొలుగొండ మండలం ఏఎల్‌పురానికి కరోనా సోకిన వ్యక్తి వచ్చాడని తెలియడంతో కొందరు గ్రామస్థులు శనివారం హడలిపోయారు. ఉద్యోగ రీత్యా రోలుగుంట మండలం కుసర్లపూడిలో అద్దె ఇంట్లో వుంటున్న ఈ గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా సోకిందని అక్కడివారు అభ్యంతరం చెప్పడంతో తన భార్యతో కలిసి ఏఎల్‌పురానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది గ్రామస్థులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అతనిని అడ్డుకుని క్వారంటైర్‌ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. నర్సీపట్నంలో బెడ్లు ఎక్కడా ఖాళీ లేవని చెప్పి, గ్రామంలోని ఇంటికి వచ్చేశాడు. దీంతో అంతా ఆందోళన చెందు తున్నారు. ఈ విషయమై కృష్ణాదేవిపేట పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ వాసిరెడ్డి ప్రణతి మాట్లాడుతూ నర్సీపట్నంలో ప్రైవేటు ల్యాబ్‌లోని సిటీస్కాన్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిం దని తెలిసిందని, అయితే అధికారికంగా రాలేదన్నారు. సదరు వ్యక్తి ఇక్కడకు వచ్చినందున హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా చెప్పామని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసు కువెళ్లామని ఆమె వివరించారు. ఇదిలావుంటే, గ్రామంలో కొందరి తీరుపట్ల ఇతర గ్రామాల ప్రజలు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి గ్రామంలో వైరస్‌ సోకినవారు ఉన్నారని, ఇటువంటి వారికి మనోధైర్యాన్ని కల్పించాల్సిన వారే ఇలా వ్యవహరించడం తగదని అంటున్నారు. 

Updated Date - 2021-05-02T05:31:25+05:30 IST