అనుమానాస్పద స్థితిలో చిరు వ్యాపారి మృతి

ABN , First Publish Date - 2021-10-07T06:16:53+05:30 IST

నగరంలోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధ వారం ఒక వ్యక్తి అను మానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతను మద్యం మత్తులో మేడ పై నుంచి పడి మృతిచెందాడా?, లేక ఎవరైనా కిందికి తోసేశారా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అనుమానాస్పద స్థితిలో చిరు వ్యాపారి మృతి

మహారాణిపేట, అక్టోబరు 6: నగరంలోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధ వారం ఒక వ్యక్తి అను మానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతను మద్యం మత్తులో మేడ పై నుంచి పడి మృతిచెందాడా?, లేక ఎవరైనా కిందికి తోసేశారా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. కల్లుపాకలు ప్రాంతానికి చెందిన షేక్‌ బాషా (48) పోలీసు బ్యారక్స్‌ సమీపంలో బట్టల వ్యాపారం చేసుకుంటు న్నాడు. బాషాకు గతంలో వివాహం కాగా కుమారుడు, కుమార్తె పుట్టిన తర్వాత మొదటి భార్యను వదిలేసి వేరొక మహిళతో ఉంటున్నాడు, ఆమెకు కూడా కుమారుడు ఉన్నాడు. ఇదిలావుండగా బాషా బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జెండా చెట్టు వీధిలో వుంటున్న హిజ్రాల నేత ఎల్లాజీ నిర్మిస్తున్న ఇంటి వద్దకు వెళ్లాడు. అరగంట తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ...బాషా మేడ పై నుంచి కిందికి పడి మృతిచెందాడు. మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరో అతడ్ని కొట్టి కిందకు తోసేసి వుంటారని కొంతమంది అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు బాషా బైక్‌పై 12.30 గంటలకు ఎల్లాజీ నిర్మిస్తున్న ఇంటి వద్దకు వచ్చినట్టు గుర్తించారు. దీంతో ఎల్లాజీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాషా రావడం వాస్తవమేనని కొంతసేపు మాట్లాడిన తర్వాత తాను కిందికి దిగి వెళ్లిపోయానని, మద్యం మత్తులో అతను కింద పడిపోయి వుండవచ్చునని చెప్పినట్టు సమాచారం. కాగా బాషాకు ఓ హిజ్రాతో సన్నిహిత సంబంధం ఉందని, ఆమె పిలవడం వల్లే అక్కడికి వచ్చినట్టు కొంతమంది పేర్కొంటున్నారు. టూటౌన్‌ సీఐ కె.వెంకటరావు, ఎస్‌ఐ నర్సింగరాజు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తర లించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-07T06:16:53+05:30 IST