గీతం విద్యార్థుల కోసం మెంటారింగ్ విధానం
ABN , First Publish Date - 2021-12-31T06:33:51+05:30 IST
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందే ప్రతి విద్యార్థికి మొదటి ఏడాది నుంచి కోర్సు పూర్తి చేసి వెళ్లేంతవరకు ఉద్యోగావకాశాలు, ఉన్నత విద్య చదువులో వెనుకబడకుండా ఉండడం వరకు ప్రతి అంశంలోనూ వెన్నంటి ఉండేలా మెంటారింగ్ (మార్గదర్శకుడు) విధానం అమలు చేయనున్నట్టు గీతం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ తెలిపారు.

సాగర్‌నగర్, డిసెంబరు 30: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందే ప్రతి విద్యార్థికి మొదటి ఏడాది నుంచి కోర్సు పూర్తి చేసి వెళ్లేంతవరకు ఉద్యోగావకాశాలు, ఉన్నత విద్య చదువులో వెనుకబడకుండా ఉండడం వరకు ప్రతి అంశంలోనూ వెన్నంటి ఉండేలా మెంటారింగ్ (మార్గదర్శకుడు) విధానం అమలు చేయనున్నట్టు గీతం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ తెలిపారు. దీనికి సంబంధించి గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ రూపొందించిన ప్రత్యేక పోర్టల్ అద్వ(సంస్కృతంలో దిశానిర్దేశం)ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతంలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులలో ప్రతి 20 మందికి ఒక అఽధ్యాపకుడు మెంటార్‌గా వ్యవహరిస్తారని, ఇందుకు గాను మొత్తం 620 మంది అధ్యాపకులకు మెంటారింగ్‌పై శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎన్.కృష్ణ మాట్లాడుతూ ఉన్నత విద్యా రంగంలో మెంటార్ బాధ్యత కీలకంగా మారిందన్నారు. గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ సహాయ డీన్ కమాండర్ గురుమూర్తి గంగాధరన్ మాట్లాడుతూ గీతంలో ప్రవేశం పొందే ప్రతి విద్యార్థి కలను నెరవేర్చేం దుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ డైరెక్టర్ ఎ .శ్రీరామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.