నేడు అరకు రైలుకు మరో విస్టాడోమ్ కోచ్
ABN , First Publish Date - 2021-11-28T06:18:24+05:30 IST
విశాఖపట్నం-కిరండోల్ మధ్య నడిచే రైలుకు ప్రస్తుతం రెండు విస్టా డోమ్ (అద్దాల) కోచ్‌లు అరకులోయ వరకు నడుస్తుండగా, ఈ ఆదివారం అదనంగా మరొకటి జత చేస్తున్నట్టు డీఆర్‌ఎం అనూప్‌కుమార్ శత్పతి తెలిపారు.

విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం-కిరండోల్ మధ్య నడిచే రైలుకు ప్రస్తుతం రెండు విస్టా డోమ్ (అద్దాల) కోచ్‌లు అరకులోయ వరకు నడుస్తుండగా, ఈ ఆదివారం అదనంగా మరొకటి జత చేస్తున్నట్టు డీఆర్‌ఎం అనూప్‌కుమార్ శత్పతి తెలిపారు. పర్యాటకుల రద్దీ ఎక్కువగా వున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వెయిటింగ్ లిస్ట్ 45 దాటిపోవడంతో అందుబాటులో వున్న మూడో విస్టా డోమ్ కోచ్‌ను కూడా నడపాలని నిర్ణయించామన్నారు. అయితే ఇది ఈ ఆదివారం మాత్రమే నడుస్తుందని అధికారులు స్పష్టంచేశారు. రెగ్యులర్‌గా డిమాండ్ ఉంటే...కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.