జిల్లాలో మరో 2 థియేటర్లు మూత
ABN , First Publish Date - 2021-12-26T06:06:24+05:30 IST
జిల్లాలో మరో రెండు సినిమా థియేటర్లు మూతపడ్డాయి.

సబ్బవరంలో ఎస్‌టీబీఎల్, రావికమతంలో శ్రీవెంకటేశ్వర...
రావికమతం/సబ్బవరం, డిసెంబరు 25: జిల్లాలో మరో రెండు సినిమా థియేటర్లు మూతపడ్డాయి. మండల కేంద్రమైన రావికమతంలో శ్రీవెంకటేశ్వర థియేటర్‌ను యాజమాన్యం స్వచ్ఛందంగా హాలును మూసివేసింది. ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ ధరలతో నడపలేమనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పెద్ద సినిమాలకు కూడా టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడం, సదుపాయాలపై ఇటీవల కాలంలో అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహిస్తుండడం కారణంగానే థియేటర్‌ను యాజమాన్యం మూసివేసినట్టు చెబుతున్నారు. అలాగే సబ్బవరంలోని ఎస్‌టీబీఎల్ సినిమా థియేటర్‌ను యాజమాన్యం శనివారం మూసివేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్నట్టు టిక్కెట్లు విక్రయిస్తే నష్టాలపాలవుతామని, అందుకే థియేటర్‌ను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.