శారదా పీఠాధిపతులను కలిసిన అన్నవరం పురోహితులు
ABN , First Publish Date - 2021-11-04T05:09:39+05:30 IST
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానానికి చెందిన వ్రత పురోహితులు బుధవారం చినముషిడివాడలోని శారదాపీఠానికి తరలివచ్చారు.
పెందుర్తి-రూరల్, నవంబరు 3: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానానికి చెందిన వ్రత పురోహితులు బుధవారం చినముషిడివాడలోని శారదాపీఠానికి తరలివచ్చారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. దేవస్థానంలో సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా వచ్చే ఆదాయంలో మరో పది శాతం పర్సెంటేజీలను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల పురోహితులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన పీఠాధిపతులకు కృతజ్ఞతలు తెలుపుతూ కృతజ్ఞతా పత్రాన్ని అందజేశారు.