కార్మికులకు ఆమోదయోగ్యమైన వేతన సవరణ చేయాలి
ABN , First Publish Date - 2021-10-21T06:03:48+05:30 IST
ఉక్కు కార్మికులకు ఆమోదయోగ్యమైన వేతన సవరణ చేయాలని ఇంటక్ ఉప ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు కోరారు. వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ప్లాంట్‌లో నినాదాలు చేశారు.

ఉక్కుటౌన్‌షిప్, అక్టోబరు 20: ఉక్కు కార్మికులకు ఆమోదయోగ్యమైన వేతన సవరణ చేయాలని ఇంటక్ ఉప ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు కోరారు. వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ప్లాంట్‌లో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వేతన ఒప్పందం కాలపరిమితి పూర్తయి ఐదు సంవత్సరాలు అవుతున్నదని, కానీ నేటివరకు వేతన సవరణ చేయలేదని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో జరగనున్న ఎన్‌జేసీఎస్ సమావేశంలో కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎంకే నాయక్, ఎండీ రఫౠ, గొందేశి ప్రభాకర్‌రెడ్డి, డి.మోహన్, ఎ.రాజేశ్వరరావు, మింది దేముడు, గంగవరం గోపి, కృష్ణ, మహాలక్ష్మి పాల్గొన్నారు.