అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-11-23T06:20:11+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న క్రమంలో సోమవారం పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు.

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి
టీడీపీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న కార్పొరేటర్‌లు, నాయకులు

టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌

గాజువాక, నవంబరు 22: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న క్రమంలో సోమవారం పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ బాబాయ్‌ వివేకా హత్య కేసు, భువనేశ్వరిపై అనుచిత వాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ సరికొత్త డ్రామా అని ప్రజల్లో అనుమానం కలుగుతున్నదన్నారు. టీడీపీ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి ఉసురు తగలకముందే రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్‌బాబు, నాయకులు శ్రీనివాసవర్మ, మొల్లి పెంటిరాజు, బలగ బాలునాయుడు, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T06:20:11+05:30 IST