అల్లూరి అంటే..అంత అలుసా..?

ABN , First Publish Date - 2021-12-31T06:34:00+05:30 IST

ఇక్కడి అల్లూరి సీతారామరాజు పార్కులో సమస్యల పరిష్కారానికి జనవరి 20న నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్ధాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు తెలిపారు.

అల్లూరి అంటే..అంత అలుసా..?
విలేఖర్ల సమావేశంలో వీరభద్రరావు, తదితరులు

 కృష్ణాదేవిపేట పార్కులో సమస్యల పరిష్కారానికి  దీక్ష 

- అల్లూరి యువజన సంఘం ప్రతినిధి ‘పడాల’

కృష్ణాదేవిపేట, డిసెంబరు 30 : ఇక్కడి అల్లూరి సీతారామరాజు పార్కులో సమస్యల పరిష్కారానికి జనవరి 20న నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్ధాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు తెలిపారు. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో గల అల్లూరి పార్కులో గురువారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లా డారు. పార్కులో అల్లూరి, గంటందొర సమాధులున్న భవనం శ్లాబ్‌ పెచ్చులూడి పడుతోందన్నారు. మ్యూజియంలో సీలింగ్‌ పాడైందని చెప్పారు. ఈ సమస్యలను పలుమార్లు అధి కారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లినా పరి ష్కారం లేకపోయిందన్నారు. అలాగే  ఈ పార్కు అభివృద్ధికి పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రూ.50లక్షలు ప్రకటించి రెండున్నరేళ్లు దాటినా పనులు ప్రారంభానికి నోచుకో లేదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వాని అల్లూరి అంటే.. అంత అలుసా.. అని ఆయన ప్రశ్నించారు. పార్కులో పనిచేస్తున్న ముగ్గురు నిరుపేద సంరక్షకులకు రెండున్నరేళ్లుగా వేతనాలు కరువయ్యా యన్నారు. ఈ సమస్యల పరిష్కారానికే జనవరిలో దీక్ష చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలపాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో అల్లూరి యువజన సంఘం ప్రతినిధులు శ్యామల వరలక్ష్మి, లక్కాకుల బాబ్జీ, మాకాడ బూరుగులయ్య, అలంబటి వరహాలరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T06:34:00+05:30 IST