ప్లాంట్‌లోకి ప్రైవేట్‌ వ్యక్తులను అడుగుపెట్టనివ్వం

ABN , First Publish Date - 2021-11-10T05:20:33+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌లోకి ప్రైవేట్‌ వ్యక్తులను అడుగుపెట్టనివ్వమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ వ్యూహాత్మక అమ్మకాల్లో భాగంగా కేంద్రం నియమించిన ట్రాన్జాక్షన్‌ అడ్వైజర్‌ ప్రతినిధులు మంగళవారం ప్లాంట్‌కు వస్తున్నారని సమాచారం అందడంతో నాయకులు బీఎఫ్‌ విభాగాధిపతి కార్యాలయం వద్ద భైఠాయించారు.

ప్లాంట్‌లోకి ప్రైవేట్‌ వ్యక్తులను అడుగుపెట్టనివ్వం
బీఎఫ్‌ విభాగం వద్ద ఆందోళన చేస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు

ఉక్కుటౌన్‌షిప్‌, నవంబరు 9: స్టీల్‌ప్లాంట్‌లోకి ప్రైవేట్‌ వ్యక్తులను అడుగుపెట్టనివ్వమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ వ్యూహాత్మక అమ్మకాల్లో భాగంగా కేంద్రం నియమించిన ట్రాన్జాక్షన్‌ అడ్వైజర్‌ ప్రతినిధులు మంగళవారం ప్లాంట్‌కు వస్తున్నారని సమాచారం అందడంతో నాయకులు బీఎఫ్‌ విభాగాధిపతి కార్యాలయం వద్ద భైఠాయించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌లోని ప్రైవేట్‌ వ్యక్తులను రానివ్వమని, ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు. ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు ఎంతటి పోరాటాలకైన సిద్ధమని పేర్కొన్నారు. ప్రైవేటీకరణను విరమించుకోకపోతే బీజేపీ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్యక్రమంలో వైటీ దాసు, గంధం వెంకటరావు, కేఎస్‌ఎన్‌.రావు, జె.సింహాచలం, యు.రామస్వామి, మురళీరాజు, జె.రామకృష్ణ, నీరుకొండ రామచంద్రరావు, జి.గణపతిరెడ్డి, డీవీ రమణారెడ్డి, పరంధామయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-10T05:20:33+05:30 IST