స్వచ్ఛసర్వేక్షణ్‌లో మొదటి ర్యాంకే లక్ష్యం

ABN , First Publish Date - 2021-12-31T06:30:19+05:30 IST

స్వచ్ఛసర్వేక్షణ్‌-2022 పోటీలో జీవీఎంసీకి మొదటి ర్యాంక్‌ లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని జీవీఎంసీ మేయర్‌ జీహెచ్‌వీ కుమారి, కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీషా పిలుపునిచ్చారు.

స్వచ్ఛసర్వేక్షణ్‌లో మొదటి ర్యాంకే లక్ష్యం
మాట్లాడుతున్న కమిషనర్‌ లక్ష్మీషా

విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛసర్వేక్షణ్‌-2022 పోటీలో జీవీఎంసీకి మొదటి ర్యాంక్‌  లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని జీవీఎంసీ మేయర్‌ జీహెచ్‌వీ కుమారి, కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీషా పిలుపునిచ్చారు. జీవీఎంసీలోని 98 కార్పొరేటర్లతో కలిసి మర్యాదపూర్వకంగా మాట్లాడేందుకు వీలుగా గురువారం సాయంత్రం పాత కౌన్సిల్‌హాల్‌లో ‘హై టీ’ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మేయర్‌, కమిషనర్‌ కలిసి ఇంతవరకూ జరిగిన స్వచ్ఛసర్వేక్షణ్‌ పోటీల్లో జీవీఎంసీ ప్రదర్శన, వివిధ కేటగిరీల్లో సాధించిన వివిధ సర్టిఫికెట్లను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కార్పొరేటర్లకు వివరించారు. అనంతరం కార్పొరేటర్లు పురుషులు, మహిళలు రెండు జట్లుగా విడిపోయి సరదాగా అంత్యాక్షరి ఆడగా, కమిషనర్‌ హిందీ పాటతో ప్రారంభించారు. ‘కాఫీ విత్‌ కార్పొరేటర్స్‌’ పేరుతో ఇకపై ప్రతీ వారం ఒక జోన్‌లోని కార్పొరేటర్లు, మేయర్‌తో కలిసి తాను భేటీ కానున్నట్టు కమిషనర్‌ వెల్లడించారు. 

Updated Date - 2021-12-31T06:30:19+05:30 IST