అగనంపూడి టోల్‌గేటును తొలగించాలి

ABN , First Publish Date - 2021-12-26T05:33:31+05:30 IST

ప్రజలకు ఆర్థిక భారం కలిగిస్తున్న అగనంపూడి టోల్‌గేటును తక్షణమే తొలగించాలని 79వ వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. టోల్‌ గేటు వద్ద శనివారం టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు.

అగనంపూడి టోల్‌గేటును తొలగించాలి
టోల్‌గేటు వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలు

కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాస్‌ డిమాండ్‌

అగనంపూడి, డిసెంబరు 25: ప్రజలకు ఆర్థిక భారం కలిగిస్తున్న అగనంపూడి టోల్‌గేటును తక్షణమే తొలగించాలని 79వ వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. టోల్‌ గేటు వద్ద శనివారం టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  గతంలో టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గం అధక్షుడు పల్లా శ్రీనివాసరావు గాజువాక బార్‌ అసోసియేషన్‌ సహకారంతో హైకోర్టులో కేసు వేయించి టోల్‌గేటును మూసి వేయించారన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించి, టోల్‌గేటును తెరిచారని వివరించారు. ఈ కారణంగా నగర శివారు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ చొరవ తీసుకొని టోల్‌గేటు వసూళ్లకు బ్రేక్‌ వేయాలని, లేకుంటే టీడీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 85వ వార్డు అధ్యక్షుడు కర్రి దశేంద్ర, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, స్థానిక నాయకులు మామిడి నరసింగరావు, గంతకోరు అప్పారావు, కరణం  జగదీశ్‌, సింగిడి సింహాచలం, కత్తి తిలక్‌, కరణం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-12-26T05:33:31+05:30 IST