రెండో డోసు వ్యాక్సిన్‌కు అగచాట్లు
ABN , First Publish Date - 2021-05-09T04:42:48+05:30 IST
ఎన్టీఆర్ వైద్యాలయానికి రెండో డోసు టీకా వేసుకునేందుకు వందలాది మంది తరలి వస్తున్నారు.

డోసులు తక్కువ.. జనం ఎక్కువ!
ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్న ప్రజలు
అనకాపల్లి, మే 8: ఎన్టీఆర్ వైద్యాలయానికి రెండో డోసు టీకా వేసుకునేందుకు వందలాది మంది తరలి వస్తున్నారు. ఇక్కడ కేవలం 70 మందికి మాత్రమే టీకా వేస్తామని వైద్యులు చెప్పడంతో బాధితులు మండి పడుతున్నారు. రోజూ ఆసుపత్రి చుట్టూ తిరగడమే తమ పనా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదటి డోసు వేసిన తరువాత రెండోడోసు వేయడానికి వ్యాక్సిన్ సిద్ధం చేసుకోవాలని తెలియదా.? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏం చెప్పాలో తెలియక సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు కల్పించుకొని రెండో డోసు వేయించాలని ప్రజలు కోరుతున్నారు.