అక్రమంగా కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-06-24T05:44:10+05:30 IST
పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమంగా కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శి నరసింహం హెచ్చరించారు.
కుళాయిలకు మోటార్లు బిగించడం నేరం
రోలుగుంట, జూన్ 23: పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమంగా కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శి నరసింహం హెచ్చరించారు. రోలుగుంటలో అక్రమ నీటి కుళాయి కనెక్షన్లు, నిర్మాణాలపై ఫిర్యాదు రావడంతో సిబ్బందితో కలిసి పరిశీలించారు. గ్రామంలో కొంత మంది అక్రమంగా కుళాయి కనెక్షన్లను ఏర్పాటు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత నెలలో గ్రామానికి చెందిన చల్లా చిట్టమ్మ మెయిన్ పైపులైనుకు అక్రమంగా ఏర్పాటు చేసిన కనెక్షన్ను తొలగించామని ఆయన తెలిపారు. అలాగే కుళాయిలకు మోటార్లు బిగించడం చట్టరీత్యా నేరమన్నారు.