పార్కింగ్ సదుపాయం లేకపోతే చర్యలు
ABN , First Publish Date - 2021-02-26T05:58:29+05:30 IST
పెరుగుతున్న వాహన వినియోగాలను దృష్టిలో పెట్టుకొని షాపింగ్ యజమానులు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ ఎస్‌ఐ కొండ అన్నారు.

కూర్మన్నపాలెం, ఫిబ్రవరి 25: పెరుగుతున్న వాహన వినియోగాలను దృష్టిలో పెట్టుకొని షాపింగ్ యజమానులు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ ఎస్‌ఐ కొండ అన్నారు. గురువారం కూర్మన్నపాలెంలో వివిధ షాపుల యజమానులతో మాట్లాడుతూ వాహనాలను రోడ్లపై నిలిపివేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందని, ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దుకాణ యజమానులు అందరూ తక్షణమే పార్కింగ్ ఏర్పాటు చేసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.