ఆళ్వార్‌దాస్‌కు ఘన నివాళి
ABN , First Publish Date - 2021-01-21T05:24:42+05:30 IST
ఉత్తరాంధ్రలో విద్యాసంస్థల స్థాపనకు ప్రేరణగా నిలిచిన ఆళ్వార్‌దాస్ 18వ వర్థంతిని ఆర్.ఆర్.వి.పురం దరి గోపాలపట్నం ఆళ్వార్‌దాస్ ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు.

వేపగుంట, జనవరి 20: ఉత్తరాంధ్రలో విద్యాసంస్థల స్థాపనకు ప్రేరణగా నిలిచిన ఆళ్వార్‌దాస్ 18వ వర్థంతిని ఆర్.ఆర్.వి.పురం దరి గోపాలపట్నం ఆళ్వార్‌దాస్ ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో ఉన్న ఆళ్వార్‌దాస్ విగ్రహానికి అధ్యాపకులు పూలమాల వేసి నివాళులర్పించారు. క్యాంపస్ కో ఆర్డినేటర్ జీవీఎఎస్ భగవాన్ మాట్లాడుతూ విద్యాసంస్థల స్థాపనతో నిరుపేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించిన మహోన్న త వ్యక్తి ఆళ్వార్‌దాస్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఏసీవీఎల్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ సి.వి.వి.ప్రసాద్, డిగ్రికళాశాల ప్రిన్సిపాల్ సి.హెచ్.రాజు, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ బి.హేమచంద్రరావు, పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ యు.గోపి తదితరులు పాల్గొన్నారు.