మునిసిపాలిటీలో సమస్యలపై ప్రశ్నల పరంపర
ABN , First Publish Date - 2021-12-30T06:05:56+05:30 IST
నర్సీపట్నం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. చైర్‌పర్సన్ జి.ఆదిలక్ష్మి అధ్యక్షతన బుధవారం ఏర్పాటైన సమావేశంలో పలు అంశాలపై ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. వీటిపై సమాధానాలు చెప్పాలని పట్టుబట్టారు.

వాడీవేడిగా కౌన్సిల్ సమావేశం
పలు అంశాలపై గళమెత్తిన టీడీపీ కౌన్సిలర్లు
ఇరు వర్గాల మధ్య వాగ్వాదం
నర్సీపట్నం అర్బన్, డిసెంబరు 29 : నర్సీపట్నం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. చైర్‌పర్సన్ జి.ఆదిలక్ష్మి అధ్యక్షతన బుధవారం ఏర్పాటైన సమావేశంలో పలు అంశాలపై ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. వీటిపై సమాధానాలు చెప్పాలని పట్టుబట్టారు. దీంతో అధికార వైసీపీకి చెందిన కౌన్సిలర్లు కలుగు జేసు కోవడంతో వాగ్వాదం చోటుచేసు కుంది. సభ ప్రారంభంలో అజెండాలోని అంశా లను చదువుతున్న సమయంలో 25 వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్, 24వ వార్డు కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధులు మాట్లాడుతూ గత సమావేశంలో లేవనెత్తిన సమస్యలు మినిట్స్ బుక్‌లో నమోదు చేసింది లేనిదీ తమకు తెలియజేయాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ల మధ్య వాగ్యుద్ధం నెలకొంది. వెంటనే చైర్‌పర్సన్ ఆదిలక్ష్మి కలుగజేసుకుని మినిట్స్ బుక్ బైలా తెప్పించి సమావేశాన్ని కొనసాగించారు. అనంతరం కౌన్సి లర్లు రాజేష్, శ్రీకాంత్‌లు మాట్లాడుతూ వీధి లైట్ల ఏర్పాటుకు తొమ్మిది లక్షల రూపాయలు కేటాయించినప్పటికీ పూర్తి స్థాయిలో లైట్లు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఎల్‌ఈడీ బల్బుల కొనుగోలులో రూ.లక్షా 46 వేలు ఎందుకు తేడాలు వచ్చాయని నిలదీశారు. దీంతో మునిసిపల్ అధికారులు కాసేపు తడబాటుకు గురయ్యారు. గృహ హక్కు పథ కంలో భాగంగా ప్రవేశపెట్టిన వన్ టైమ్ సెటిల్‌మెంట్ వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కౌన్సిలర్లు రాజేష్ తదితరులు సభ దృష్టికి తీసుకు వచ్చారు. పారిశుధ్య పనులు సరిగా చేప ట్టక పోవడంతో పట్టణ ప్రజలు దోమల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌన్సిలర్ పెదిరెడ్ల దివ్య వివరించారు. అలాగే, మునిసిపాలిటీలో మరిన్ని సమ స్యలను ప్రస్తావించారు. ఈ సమావేశంలో కమిషనర్ కనకారావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.