సందడిగా అమ్మవారి ఘటాల ఊరేగింపు

ABN , First Publish Date - 2021-03-22T05:49:04+05:30 IST

స్థానిక గవరపాలెంలో ఆదివారం నూకాంబిక అమ్మ వారి 101 ఘటాలను భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.

సందడిగా అమ్మవారి ఘటాల ఊరేగింపు
అమ్మవారి ఘటాలను ఊరేగిస్తున్న దృశ్యం

అనకాపల్లిటౌన్‌, మార్చి 21: స్థానిక గవరపాలెంలో ఆదివారం నూకాంబిక అమ్మ వారి 101 ఘటాలను  భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. రైతు సంఘం వీధికి చెందిన భక్తుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ పండగకు వైసీపీ పార్లమెంట్‌ పరిశీలకులు దాడి రత్నాకర్‌ సతీ సమేతంగా హాజరయ్యారు. కార్యక్రమంలో 81వ వార్డు కార్పొరేటర్‌ పీలా సౌజన్య రాంబాబు, పీవీ రాజేశ్వర రావు, కర్రి సతీష్‌, కొణతాల సందీప్‌, పి.మురళీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T05:49:04+05:30 IST