భిన్న సంస్కృతుల కలయికే రాజ్యాంగం
ABN , First Publish Date - 2021-11-27T04:24:40+05:30 IST
భిన్న సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు, కుల, మతాల కలయికే మన రాజ్యాంగమని దామో దరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం మాజీ వీసీ ఆచార్య వై.సత్య నారాయణ తెలిపారు.

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
సబ్బవరం, నవంబరు 26 : భిన్న సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు, కుల, మతాల కలయికే మన రాజ్యాంగమని దామో దరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం మాజీ వీసీ ఆచార్య వై.సత్య నారాయణ తెలిపారు. వర్సిటీలో శుక్రవారం నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రాజ్యాంగంలో ఎక్కడా కేంద్రం అనే పదం లేదన్నారు. యూనియన్ అని మాత్రమే ఉందని, అనేక రాష్ట్రాలు యూనియన్ అని చెబుతూ.. ప్రతి రాష్ట్రం దాని హక్కులను, స్వతంత్రతను కాపాడుకుంటూ ఒక యూని యన్‌గా ఉన్నాయని, యూనియన్ గవర్నమెం ట్‌కు కూడా కొన్ని పవర్స్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. వీసీ ప్రొఫెసర్ సూర్య ప్రకాశ్ రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ రాజ్యాంగ పీఠిక ప్రారంభంలోనే మనం అనే పదం ఉందని, మతం, కులం, ప్రాంతానికి ప్రాముఖ్యత లేదన్నారు. కార్య క్రమంలో సెంటర్ ఫర్ కమర్షియల్ లాస్ స్టూడెంట్ న్యూస్ లెటర్‌ను ఆవిష్కరించారు. రిజిస్ట్రార్ కె.మధుసూదనరావు, అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ దయానందమూర్తి, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
సబ్బవరంలో..
సబ్బవరం: స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో శుక్రవారం హెచ్‌ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం అప్పలరాజు, దళిత సంఘం నేత జి.సామ్రాట్‌కుమార్, ఉపాధ్యా యులు అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులు అంబేడ్కర్, బాబూ రాజేం ద్రప్రసాద్, భగత్‌సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, ఇందిరాగాంధీ వేషధారణతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యా యులు చిన్నమ్మాయి, కేవీఎన్ విజయలక్ష్మి, శకుంతల, పి.ప్రసాద్, డేవిడ్, సురేశ్, రాధా కుమారి, ప్రకాశ్, పీడీ రెహమాన్ పాల్గొన్నారు.