ఉన్నత లక్ష్యంతోనే ఉజ్వల భవిష్యత్తు

ABN , First Publish Date - 2021-12-19T06:03:12+05:30 IST

విద్యా ర్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటిని సాధించేందుకు అహరహం శ్రమించాలని ఇండి యన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.ఎస్‌. ఆర్‌.కె.ప్రసాద్‌ సూచించారు.

ఉన్నత లక్ష్యంతోనే ఉజ్వల భవిష్యత్తు
సమావేశంలో మాట్లాడుతున్న ఐఐపీఈ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌

కెమికల్‌ కళాశాల వేడుకల్లో  ప్రొఫెసర్‌ వి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌

కంచరపాలెం, డిసెంబరు 18: విద్యా ర్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటిని సాధించేందుకు అహరహం శ్రమించాలని ఇండి యన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.ఎస్‌. ఆర్‌.కె.ప్రసాద్‌ సూచించారు. కంచరపాలెంలోని కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో రెండో రోజు కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 


ఈ సందర్భం గా మాట్లాడుతూ మంచి ఆలోచనలు, కష్టపడే తత్వం బంగారు భవిష్యత్తుకు పునాది వంటివ న్నారు. నైపుణ్యంతో కూడిన విద్యను అలవర్చు కుని ఉన్నత స్థానాలతో ఉత్తమపౌరులుగా ఎద గాలని, సమాజానికి మేలు చేయాలని కోరారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌) ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోందని, దీనిపై విద్యార్థులు దృష్టిసారించి పట్టు సాధించాలని సూచించారు. 


కళాశాల పూర్వ విద్యార్థులు, కోర మాండల్‌ ఫెర్టిలైజర్స్‌, టయోటా కంపెనీల ప్రతి నిధులు ఈ ఉత్సవాలకు హాజరై మాట్లాడుతూ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభ ఉన్న వారికి  తమ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తా మని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వి.రమణ ఆధ్వర్యంలో రెండో రోజు కార్యక్రమాలు ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా సాగాయి. ఈ సందర్భంగా అతిథులు, పూర్వ విద్యార్థులను సత్కరించారు. 

Updated Date - 2021-12-19T06:03:12+05:30 IST