తాళ్లచీడికాడలో 12 అడుగుల గిరి నాగు హతం

ABN , First Publish Date - 2021-04-06T06:13:11+05:30 IST

ఉపాధి పనులు చేప డుతున్న కూలీలను ఓ పే...ద్ద గిరినాగు పాము భయపెట్టింది.

తాళ్లచీడికాడలో  12 అడుగుల గిరి నాగు హతం
హతమైన గిరినాగు పాము

 కృష్ణాదేవిపేట, ఏప్రిల్‌ 5 : ఉపాధి పనులు చేప డుతున్న కూలీలను ఓ పే...ద్ద గిరినాగు పాము భయపెట్టింది. గొలుగొండ మండలం తాళ్లచీడికాడలో సోమవారం ఉదయం  ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలు చెరువు పనులు చేస్తున్నారు. ఇంతో పన్నెండు అడుగులున్న గిరి నాగుపాము వారికంట పడింది. దీంతో అంతా భయాందోళన చెందారు. దానిని అక్కడి నుంచి పం పేందుకు ఎంత బెదిరిం చినా కదల లేదు. సరికదా.. బుసలు కొడుతూ పైకి లేస్తుండడంతో చేసేది లేక దానిని హతమార్చారు. అనంతరం దానిని చూసి నవారంతా ఆశ్యర్యపోయారు. గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతంలో ఇంత పొడవైన పామును చూడలేదన్నారు.

Updated Date - 2021-04-06T06:13:11+05:30 IST