జోన్‌ 8లో 59 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-22T04:26:54+05:30 IST

జీవీఎంసీ జోన్‌ 8 పరిధిలోని 89 నుంచి 98 వార్డుల్లో 59 కరోనా కేసులు నమోదయ్యాయని ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ లక్ష్మీతులసి శుక్రవారం తెలిపారు.

జోన్‌ 8లో 59 కరోనా కేసులు

వేపగుంట, మే 21: జీవీఎంసీ జోన్‌ 8 పరిధిలోని 89 నుంచి 98 వార్డుల్లో 59 కరోనా కేసులు నమోదయ్యాయని ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ లక్ష్మీతులసి శుక్రవారం తెలిపారు. 92వ వార్డులో అత్యధికంగా 19 కేసులు నమోదయ్యాయన్నారు. 

సబ్బవరంలో 19..

సబ్బవరం: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 19 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఎంపీడీవో రమేశ్‌నాయుడు శుక్రవారం తెలిపారు. బోదువలసలో 5, గుల్లేపల్లి 3, మలునాయుడు పాలెం 1, మొగలిపురం 1, తవ్వవానిపాలెం 1, వంగలి 2, సబ్బవరం-2లో 4, సబ్బవరం-3లో 1, ఆరిపాక 1 కేసులు నమోద య్యాయన్నారు. కాగా 29 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు మండలంలో మొత్తం 1712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 548 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందన్నారు. 3849 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్టు ఆయన పేర్కొన్నారు.

34 మందికి కొవిడ్‌ పరీక్షలు

పరవాడ: పరవాడ పీహెచ్‌సీలో 23 మందికి, వాడచీపురుపల్లిలో 11 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశామని వైద్యాధికారులు రవీంద్ర రంజిత్‌, కనక అప్పారావు తెలిపారు. అలాగే పరవాడ పీహెచ్‌సీ పరిధిలో నిర్వహించిన పరీక్షల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి తెలిపారు. 

Updated Date - 2021-05-22T04:26:54+05:30 IST