29న 5ఏ సైడ్ హాకీ టోర్నీ
ABN , First Publish Date - 2021-08-26T05:29:09+05:30 IST
క్రీడా దినోత్సం సందర్భంగా జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన 5ఏ సైడ్ పురుషులు, మహిళల హాకీ టోర్నీ నిర్వహించనున్నట్టు సంఘం కార్యదర్శి భవానీశంకర్ తెలిపారు.

విశాఖపట్నం (స్పోర్ట్సు), ఆగస్టు 25: క్రీడా దినోత్సం సందర్భంగా జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన 5ఏ సైడ్ పురుషులు, మహిళల హాకీ టోర్నీ నిర్వహించనున్నట్టు సంఘం కార్యదర్శి భవానీశంకర్ తెలిపారు. సాలిగ్రామపురంలోని పోర్టు హాకీ గ్రౌండ్‌లో ఒకరోజు జరిగే ఈ పోటీల్లో జిల్లాకు చెందిన పలు జట్లు ప్రాతినిథ్య వహిస్తాయన్నారు. ఆసక్తి గల జట్ల క్రీడాకారులు మరిన్ని వివరాల కోసం తనను 98492 56463 సెల్ నంబర్‌లో సంప్రతించాలని పేర్కొన్నారు.