కలెక్టరేట్‌ స్పందనలో 290 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2021-12-07T06:18:33+05:30 IST

కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 290 ఫిర్యాదులు, అర్జీలు అందినట్లు జల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు.

కలెక్టరేట్‌ స్పందనలో 290 ఫిర్యాదులు
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌, జేసీలు

విశాఖపట్నం, డిసెంబరు 6: కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 290 ఫిర్యాదులు, అర్జీలు అందినట్లు జల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. సోమవారం కార్యక్రమంలో అర్జీదారుల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖలకు పంపి సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, ఆనందపురం మండలం శొంఠ్యాంకు చెందిన సిమ్మ లక్ష్మి ఈనెల 5వ తేదీన బావిలో శవమై తేలిన ఘటన నేపథ్యంలో దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని మృతురాలి కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమంలో జేసీలు వేణుగోపాలరెడ్డి, అరుణబాబు, కల్పనాకుమారి పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-07T06:18:33+05:30 IST